Vahini Current Issue : Feb 2026

సంపాదకీయం

వాహిని ప్రియ పాఠక మహాశయులందరికి సంపాదకీయ కార్యవర్గ సభ్యుల ప్రణామములు. బాధ్రపద మాసంలో ఆగష్టు వాహిని మాసపత్రిక పాఠకులందరికీ, సవినయ నమస్సులతో, పఠనానికై ఆహ్వానిస్తున్నాము.

హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానము చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి మన శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుందని విశ్వాసం.

తెలుగు మాసాల్లో ఫాల్గుణ మాసం చివరిది అంటే 12వ మాసం. ఈ మాసం తర్వాత వచ్చే చైత్ర మాసంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. మాఘమాసం ముగిసిన వెంటనే వచ్చే ఈ ఫాల్గుణ మాసం వేసవికి ఆరంభంగా పేర్కొంటారు.

ఈ ఫాల్గుణ మాసం శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసంగా. ఈ ఫాల్గుణ మాసంలో పయో వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించి శ్రీమహావిష్ణువుకు క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణంలో పేర్కొనబడింది. పూర్వం ఆదితి ఈ పయో వ్రతాన్ని ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.

వాహిని పాఠకులకు సాంకేతిక పరిజ్ఞానం మేళవిస్తూ, ప్రాంతీయ తెలుగుతనాన్ని ప్రోత్సహిస్తూ మేము మీకు అందిస్తున్న ఈ సంచిక మీకు నచ్చుతుందని ఆకాంక్షిస్తున్నాము.

ఈ సంచిక సంపాదకీయంలో మాకు సహకరించి, వాహిని మాసపత్రికకు రచనలు అందచేసిన రచయితలకు, అలాగే ప్రకటన కర్తలకు, సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికి ధన్యవాదాలు. తెలుగు సంస్కృతి, సాహిత్యంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ, వాహిని లో మన తెలుగు వారికి అందించాలనే ఒక తపనతో చేసిన ఈ ప్రయత్నాన్ని సహకరిస్తారని ఆకాంక్షిస్తూ....


మీ శ్రేయోభిలాషులు,

శ్రీనివాస్ గోవర్ధనం
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.